11, ఆగస్టు 2016, గురువారం

అది ఎన్టీఆర్ పడ్డ కష్టo



యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే, ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న ఎన్టీఆర్ కి అన్ని కలిసివస్తున్నాయని అంటున్నా అది ఎన్టీఆర్ పడ్డ కష్టమని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ పై ఓ రూమర్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే పవన్ కళ్యాణ్ మహేష్ బాబుల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకే ఏడాది డిసాస్టర్లు అయితే ఆ ఏడాది ఎన్టీఆర్ క్లీన్ స్వీప్ చేస్తాడని అంటున్నారు. ఇది సరిగ్గా 2010 లో అదుర్స్ తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ కి పోటి ఇవ్వబోయిన పవన్ కొమురం పులి, మహేష్ ఖలేజాలు డిసాస్టర్లు అయ్యాయి.

కాగా ఎన్టీఆర్ తిరిగి బృందావనంతో ఆ ఏడాది మరో హిట్ కొట్టి క్లీన్ స్వీప్ చేశాడు, ఇప్పుడు కూడా పవన్ మహేష్ లు నటించిన సినిమాలు ఎన్టీఆర్ నాన్నకుప్రేమతోని అందుకోలేక బొక్కబోర్లా పడగా మళ్ళీ ఎన్టీఆర్ తన రికార్డును తానె బ్రేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అందుకే హిస్టరీ రిపీట్ అవుతుంది అంటున్నారు.


లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్