22, ఆగస్టు 2016, సోమవారం

ఎన్టీఆర్ ని ఆపడం కష్టమే



టాలీవుడ్ లో ఎప్పటికీ క్రేజ్ తగ్గని హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. కెరీర్ మొదట్లో రెండు బిగ్గెస్ట్ మాస్ హిట్స్ కొట్టినా తరువాత ఆ రేంజ్ హిట్స్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నా ఎన్టీఆర్ సినిమాలపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు ఎప్పుడూ.


సరైన సినిమా పడితే బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేసుకుంటాడు అని ట్రేడ్ పండితులు ఎప్పటి నుండో చెబుతున్నా ఆ సరైన సినిమాకి సరైన డేట్ ని ఫిక్స్ చేయడంలో ఎన్టీఆర్ విఫలం అయ్యాడు. రెండు మంచి చాన్సులను వదులుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు జనతాగ్యారేజ్ తో అలాంటివి ఏమి జరగవు అనుకున్నా మరోసారి అలానే జరిగింది.



కానీ మిగిలిన సినిమాల విషయంలో కన్నా జనతాగ్యారేజ్ కి ఉన్న క్రేజ్ ప్రిడిక్ట్ కూడా చేయలేకపోతున్నారు ట్రేడ్ పండితులు. కాగా ఇప్పుడు ట్రైలర్ సృష్టిస్తున్న సునామీ చూస్తుంటే సెప్టెంబర్ 2 నుండి తెలుగులో మూడు వారాలు ఎలాంటి పోటి లేదు కాబట్టి ఎన్టీఆర్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసే మంచి చాన్స్ దక్కినట్లే అంటున్నారు.

ప్రస్తుతం సినిమాకి ఉన్న బజ్ దృశ్యా ఈ మార్క్ ని మంచి టాక్ సొంతం చేసుకుంటే బీట్ చేయడం పెద్ద కష్టం కూడా అవ్వదని అంటున్నారు. మరి జనతాగ్యారేజ్ ఎన్టీఆర్ కి తిరుగులేని హిట్ ఇస్తుందో లేదో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
please Like us

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్