17, డిసెంబర్ 2016, శనివారం

తారక్-బాబీ సినిమాపై మరో షాకింగ్ న్యూస్..


జనతా గ్యారేజ్’తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ‘నటరుద్ర’ ఎన్టీఆర్ సుమారు మూడు నెలల గ్యాప్ తర్వాత దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో రూపొందబోయే చిత్రాన్ని తన హోమ్ బ్యానర్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్’ నిర్మించనున్నట్లు కళ్యాణ్ రామ్ ట్విటర్ వేదికగా అధికారికంగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఇందులో తారక్ మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నాడని, ఆ క్యారెక్టర్లకు తగ్గట్టుగా ముగ్గురు హీరోయిన్లైన కాజల్ అగర్వాల్, అనుపమ, నివేదా థమస్‌లను ఎంపిక కూడా చేశారని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం గురించి మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆ ముగ్గురు హీరోయిన్లతోపాటు మరో కథానాయికగా ఇందులో కనిపించబోతోందట. అయితే.. ఈమెది ఫుల్ లెంగ్త్ రోల్ కాదని, ఆమెతో ఓ ఐటెం సాంగ్ చేయించనున్నారని టాక్. ‘జనతా గ్యారేజ్’ తరహాలోనే ఇందులోనూ ఓ స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ చేయించాలని బాబీ ప్లాన్ వేశాడట. ఇందుకు కళ్యాణ్, ఎన్టీఆర్‌లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆ పాటకి సరిపోయే భామని వెతికే పనిలో యూనిట్ నిమగ్నమైనట్లు చెప్పుకుంటున్నారు. అంటే.. మొత్తం నలుగురు భామలు ఈ చిత్రాన్ని తమ గ్లామరసంతో రక్తి కట్టించనున్నారన్నమాట. మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకి తీసుకెళ్ళాలని యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Related News see here
బాబాయ్ ట్రైలర్.. అబ్బాయిలు అదరగొట్టారు

లేబుళ్లు: ,

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్