పొరుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ మేనియా
అన్ డౌటెడ్ గా ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల్లో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కే అని చెప్పాలి, నాన్నకుప్రేమతో లాంటి క్లాస్ మూవీతో అక్కడ 8 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఎన్టీఆర్ తరువాత తన క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు.
అక్కడ పవర్ స్టార్ పునీత్ కోసం పాడిన పాటతో తన పాపులారిటీ పదిరెట్లు పెంచుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం అక్కడ బిగ్గెస్ట్ క్రూడ్ పుల్లర్ గా నిలిచాడు. లేటెస్ట్ గా పునీత్ 25 వ సినిమా చక్రవ్యూహ్ కి భారీ కలెక్షన్స్ రావడానికి పరోక్ష కారణం కూడా ఎన్టీఆర్ అనే అంటున్నారు చాలామంది.
ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టినరోజు కావొచ్చు, జనతాగ్యారేజ్ టీసర్-ట్రైలర్ కావొచ్చు, యూనిట్ ఆన్ లొకేషన్ ఫోటోలు కావోచ్చ్చు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ భారీ లెవల్ లో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పేరు ట్రెండ్ చేశారు అక్కడి అభిమానులు. దాంతో ప్రస్తుతం కర్ణాటకలో ఎన్టీఆర్ ని మించిన హీరో లేడని, ఇది జనతాగ్యారేజ్ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అందరికీ అర్ధం అవుతుందని అంటున్నారు.
లేబుళ్లు: JANATHA GARAGE, Karnataka fans, move collections, Ntr, NTR stamina


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్