బాలయ్య మళ్ళీ ఫైట్!!
add facebook like buttonనందమూరి బాలకృష్ణ ఆ మధ్యన తన కొత్త సినిమా షూటింగ్ లో గాయపడిన విషయం తెలిసిందే. ఇటీవలే మళ్లీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. గత పది రోజులుగా కొన్ని వినోదభరిత సన్నివేశాలు చిత్రీకరించిన యూనిట్, ఇప్పుడు బాలయ్య గాయం నొప్పి పూర్తిగా నయం కావడంతో ఫైట్ సన్నివేశాల చిత్రీకరణకు రెడీ అయ్యింది. గాయంతో పెండిగ్ లో పడిన యాక్షన్ సీక్వెన్స్ ఫినిష్ చేసేందుకు బాలయ్య మళ్లీ యాక్షన్ లోకి దిగారు. ఫైట్ మాస్టర్లు రామ్ -లక్ష్మణ్ నేతృత్వంలో ఈ యాక్షన్ దృశ్యాలను ప్రస్తుతం హైదరాబాదులో చిత్రీకరిస్తున్నారు. నూతన దర్శకుడు సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. త్రిష, రాధికా ఆప్టే కథానాయికలు. రుద్రపాటి రమణారావు నిర్మాత. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.


0 కామెంట్లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్