3, సెప్టెంబర్ 2014, బుధవారం

ఏపీ కేపిటల్లో టీవీ నైన్...ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్స్..!


add facebook like button Author : Murali Krishna Choudhary 
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కన్నెర్రతో
నెలల తరబడి ఎంఎస్వోలు...ఏబీఎన్
ఆంధ్రజ్యోతి..టీవీ నైన్ ఛానళ్ల
ప్రసారాలు నిలిపివేయడంతో వాటి
భవిష్యత్ ఏమిటనేది చర్చనీయాంశమైంది.
ఇప్పటికే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
యాజమాన్యం..ఏపీ కేపిటల్ లో తమ
బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేయాలని
కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే..మొత్తం ఛానల్ అంతా ఏపీకి షిఫ్ట్
చేస్తారా..? లేక బ్రాంచ్ ఆఫీస్ మాత్రమే
అక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ యథాతథంగా
కొనసాగిస్తారా..? అనేది రెండు నెలల్లో
తేలిపోతుంది.
ఎందుకంటే...ఇప్పుడు తెలంగాణలోనూ రాజకీయాలు మారుతున్నాయి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ
రాధాకృష్ణకు సన్నిహితుడైన తుమ్మల
టీఆర్ఎస్ లోకి రావడం...వల్ల ప్రసారాల
పునరుద్ధరణ అంశంలో కొంత
పట్టువిడుపులు రావచ్చని తెలుస్తోంది.
దీనికితోడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్
భేటీలో ఛానళ్ల ప్రసారాల పునరుద్ధరణ
విషయంలో ఓ నిర్ణయం వెలువడవచ్చని
తెలుస్తోంది. అదే జరిగితే...ఏబీఎన్
ఆంధ్రజ్యోతి ఏపీలో రెండో రాష్ర్ట ఛానల్
గా ...అంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
ఆంధ్రప్రదేశ్ కొనసాగవచ్చని తెలుస్తోంది.
అప్పుడు హైదరాబాద్ ఏబీఎన్
ఆంధ్రజ్యోతి ప్రసారాలు పునరుద్ధరణ
జరిగితే...తెలంగాణ రాష్ర్ట ఛానల్ గా
వ్యవహరిస్తుందని సమాచారం.
ఇప్పుడు ఈటీవీ..సిక్స్ టీవీ...అదే రీతిలో
రెండు రాష్ర్టాలకు ప్రత్యేక పేరుతో
రెండు ఛానళ్లుగా ప్రసారాలు ప్రత్యేకంగా
అందిస్తున్నాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
కూడా అదే బాటలో నడవవచ్చని సమాచారం.
ఇక టీవీ నైన్ విషయానికి వస్తే...ప్రసారాల
పునరుద్ధరణ అంశం ఏబీఎన్ తోపాటే
తేలిపోతుంది. అయితే...ప్రస్తుతం..అదే
గ్రూప్ సీఈవో రవి ప్రకాష్ ఆరంభించిన
టీవీ వన్ ఛానల్..పూర్తిగా తెలంగాణ ఛానల్
గా మారుతోంది. దీనికి ఇప్పటికే స్టాఫ్ తో
పాటు అన్ని ఏర్పాట్లు జరిగాయి. టీవీ వన్
పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా తెలంగాణ
న్యూస్ ఛానల్ గా ఇరవైనాలుగు గంటల
ప్రసారాలకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఇక టీవీ నైన్...వ్యవహారంలో ఎలాంటి
నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.
ఏపీకి...తెలంగాణకు రెండు ఛానళ్లుగా
మారుస్తారా..? లేక పాత పేరుతోనే
ప్రసారాలు కొనసాగిస్తారా..? ఏపీ కొత్త
కేపిటల్ లో టీవీ నైన్ ఛానల్ ఆఫీస్ పూర్తి
స్థాయిలో ఏర్పాటవుతుందా..? పాక్షికంగా
రూపుదిద్దుకుంటుందా..? టీవీ నైన్ ఛానల్
యాజమాన్యం చేతులు మారుతుందా..?
తగిన డీల్ కుదురుతుందా..? లేదా..? అనే
పశ్రలు చర్చనీయాంశమయ్యాయి.
ఇంతకూ ఏంజరుగుతుందనేది వేచి
చూడాల్సిందే..!

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

<< హోమ్