ఇక్కడ ే ఉంటా, బాధ్యత నాదే : తుమ్మలప ై బాబు బాధ
add facebook like button
హైదరాబాద్: తాను ఎక్కడికీ వెళ్లనని,
ఇక్కడే ఉంటానని, 2019లో తెలంగాణలో
అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని,
ఖమ్మం జిల్లాలో పది సీట్లు గెలిపించే
బాధ్యత తనదేనని ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ
అధ్యక్షులు నారా
చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు.
ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ
నాయకులు,
కార్యకర్తలు చంద్రబాబును హైదరాబాదులో
కలిశారు. తుమ్మల నాగేశ్వర
రావు పార్టీని వీడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వారు అధినేతను కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పార్టీ నుండి ఒక్క నాయకుడు వెళ్లిపోతే
వందమందిని తయారు చేసే శక్తి
తనకు ఉందని చెప్పారు. తాను ఎక్కడికి
పోనని, ఇక్కడే ఉంటానని అన్నారు.
కార్యకర్తలకు, నాయకులకు ఇబ్బంది
వస్తే తాను ముందు ఉంటానని చెప్పారు.
ఎవరినీ వదిలి పెట్టే సమస్య
లేదన్నారు. ఖమ్మం వస్తానని, పది
సీట్లు గెలిపించే బాధ్యత తనదే
అన్నారు. 2019లో అధికారం తమదే
అన్నారు.
గెలిచిన రెండు నెలలకే పార్టీని
వీడుతున్నారన్నారు. ముప్పయ్యేళ్ల
పాటు పార్టీలో ఉండి, పార్టీలో ఎంతో ఎదిగి,
ఎన్నో ఉన్నత స్థానాలను దక్కించుకున్న
నేతలు ఇప్పుడు పార్టీని,
కార్యకర్తలను మోసం చేసి వెళ్లడమే
తనకు బాధ అన్నారు. టీడీపీ ఎన్టీఆర్
పెట్టిన పార్టీ అని, దీనిని
ఎవరూ దెబ్బతీయలేరన్నారు. పార్టీకి
రెండు ప్రాంతాలు రెండు కళ్లు అన్నారు.
Story first published: Tollywoodnbk
English Summary
Khammam district Telugudesam
Party leaders and activists meet AP
CM Nara Chandrababu Naidu.

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
<< హోమ్