జనతా గ్యారేజ్.. 5రోజుల కలెక్షన్స్ అదుర్స్..
‘జనతా గ్యారేజ్’ హవా కొనసాగుతూనే ఉంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 50కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన జనతా గ్యారేజ్.. తన హవాని కొనసాగిస్తూనే ఉంది. ఐదు రోజుల లాంగ్ వీకెండ్ బాగా కలిసిరావడంతో ఏపీ, తెలంగాణలో మొత్తం రూ. 41.34 కోట్ల షేర్ వసూలు చేసింది గ్యారేజ్. ఇక, మొత్తం వసూళ్లు కలుపుకుంటే దాదాపు రూ. 60కోట్లకి దగ్గరగానే వచ్చేసింది.
గ్యారేజ్ నైజాంలో అత్యధికంగా రూ. 13.44 కోట్ల వసూలు చేయడం విశేషం. ఏరియాల వారీగా గ్యారేజ్ 5 రోజుల కలెక్షన్ ని చూస్తే.. సీడెడ్ :7.45 కోట్లు,
ఓవర్సీస్ :4.73 కోట్లు, తూర్పు గోదావరి :3.55 కోట్లు, పశ్చిమ గోదావరి :3.05 కోట్లు, కృష్ణా :3.26 కోట్లు, గుంటూరు :4.36 కోట్లు, నెల్లూరు :1.50 కోట్లు వసూలు చేసింది. మరోవారం పాటు గ్యారేజ్ వసూళ్ల పర్వం ఇలాగే కొనసాగితే.. మరిన్ని రికార్డ్స్ బ్రేక్ అవ్వడం ఖాయం.
మొత్తం మీద సుమారు 64 కోట్లతో తొలి ఐదురోజుల కలెక్షన్స్ తో దూసుకుపోతుంది జనతా గ్యారేజ్.
లేబుళ్లు: collections, JANATHA GARAGE


<< హోమ్