ఎన్టీఆర్ ఎవరితో చేస్తాడబ్బా!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ సెన్సేషన్స్ కి కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ క్రోర్స్ క్లబ్ లో బాహుబలి తర్వాత సెకండ్ ప్లేస్ ని సాధించేసింది. వచ్చే వారం వరకూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర జనతా గ్యారేజ్ సందడి ఖాయంగానే కనిపిస్తోంది. ఈలోపు ఎన్టీఆర్ చాలానే రికార్డులను తిరగరాసేస్తాడు కానీ.. ఆ తర్వాత ఏం చేస్తాడన్నదే అసలు పాయింట్.
టెంపర్.. నాన్నకు ప్రేమతో చిత్రాల తర్వాత ఎన్టీఆర్ ఖాతాలో వరుసగా మూడో హిట్ పడింది. ప్రతీ మూవీకి రేంజ్ పెంచుకుంటూ ఇప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టేస్తున్నాడు. మరి తర్వాత చేయబోయే మూవీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ డిసైడ్ కావడం సహజమే. వక్కంతం వంశీకి ఓకే చెప్పేశాడని గతంలో వార్తలొచ్చాయ్ కానీ.. ఇంకా కథ విషయంలో ఎన్టీఆర్ సంతృప్తి చెందలేదని టాక్. మరోవైపు ఇతర పెద్ద దర్శకులతో సినిమా చేద్దామంటూ అందరూ బిజీబిజీగా ఉన్నారు.
చిరంజీవితో వినాయక్.. బాహుబలితో రాజమౌళి.. రామ్ చరణ్ తో సుకుమార్.. వరుణ్ తేజ్ తో వైట్ల.. ఇలా ప్రతీ ఒక్కరూ వేరే ప్రాజెక్టులతో తెగ బిజీ. అందరి చేతుల్లోనూ క్రేజీ ప్రాజక్టులున్నాయి. ఒక్క పూరీ జగన్నాథ్ మాత్రమే ఇజంను ఫినిషింగ్ స్టేజ్ కి తెచ్చాడు. ఆ సినిమా హిట్ అయితే.. మరోసారి టెంపర్ కాంబో రిపీట్ అవుతుందనే అంచనాలున్నా.. కొత్త దర్శకుల కథలు వినేందుకు కూడా యంగ్ టైగర్ రెడీ అంటున్నాడట. ఏదేమైనా క్లారిటీ రావాలంటే మాత్రం.. ఓ 20 రోజుల తర్వాతే. ఎందుకంటే ఈ టైమ్ లో ఫుల్ రెస్ట్ తీసుకోవాలని ఎన్టీఆర్ డిసైడ్ అయిపోయాడు.
లేబుళ్లు: Ntr, Telugu news


<< హోమ్