మహేష్ టెన్షన్ పడుతుంటాడేమో
గత కొన్నేళ్లుగా మహేష్ బాబు టైం ఏమంత బాగుండట్లేదు. ‘శ్రీమంతుడు’ మినహాయిస్తే అతడి ఖాతాలో హిట్టు లేదు. వేరే సినిమాలు ఫ్లాప్ అయినా పర్వాలేదు. దారుణమైన డిజాస్టర్లయ్యాయి. 1 నేనొక్కడినే.. ఆగడు.. బ్రహ్మోత్సవం.. ఇలా ఒకదాన్ని మించి ఇంకొకటి డిజాస్టర్లయ్యాయి. అందులోనూ ‘బ్రహ్మోత్సవం’ కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ‘ఆగడు’ టైంలో లాగే ‘బ్రహ్మోత్సవం’ తర్వాత కొన్నాళ్ల పాటు బయటికి రావడానికే ఇష్టపడనంత డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు మహేష్. ఇప్పుడతడి ఆశలన్నీ మురుగదాస్ సినిమా మీదే ఉన్నాయి. ఐతే మహేష్ కు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది.
మహేష్ తో ప్రస్తుతం సినిమా చేస్తున్న మురుగదాస్.. తర్వాత సినిమా తీయబోయే కొరటాల శివల చివరి సినిమాలు ఒక రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. సెప్టెంబరు 1న కొరటాల ‘జనతా గ్యారేజ్’ రిలీజైతే.. తర్వాతి రోజు మురుగదాస్ ‘అకీరా’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే ఈ రెండు సినిమాలూ అంచనాల్ని అందుకోలేకపోయాయి. ‘జనతా గ్యారేజ్’కు కలెక్షన్లు బాగానే ఉన్నాయి కానీ.. టాక్ అయితే అంత బాగా లేదు. కొరటాల అంచనాలు అందుకోలేకపోయాడన్నది మాత్రం వాస్తవం. అతడి గత సినిమాల్లో ఉన్న బిగి.. పకడ్బందీ కథనం ఇందులో లేవు. మరోవైపు ‘అకీరా’ డివైడ్ టాక్ తో మొదలై ఫ్లాప్ దిశగా సాగుతోంది. మురుగ ఖాతాలో చాన్నాళ్ల తర్వాత ఓ ఫ్లాప్ పడబోతోందని తేలిపోయింది. కాబట్టి మురుగ.. కొరటాలలతో సినిమాలు చేయబోతున్న మహేష్ కు ఈ ఫలితాలు కొంత నిరాశ కలిగించేవే. ఈ ఫలితాలు ఆ దర్శకులిద్దరి ఆలోచనలపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి. వాళ్ల కాన్ఫిడెన్స్ ను దెబ్బ తీస్తాయి. అది తన సినిమాలపై పడుతుందని కూడా కొంత కంగారు పడుతుండొచ్చు మహేష్.
లేబుళ్లు: Mahesh Babu, Telugu news


<< హోమ్