1, సెప్టెంబర్ 2016, గురువారం

జనతాగ్యారేజ్ సినిమా : 13 ఏళ్ల దాహం తీరేలా ఉంది



జనతాగ్యారేజ్ సినిమా : 13 ఏళ్ల దాహం తీరేలా ఉంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటివరకు జనతాగ్యారేజ్ కి ముందువరకు 25 సినిమాలు చేశాడు, అందులో ఇప్పటికీ అందరికీ గుర్తుండే సినిమాలు ఆది, సింహాద్రి. ఈ రెండు సినిమాలు దక్కించుకున్న క్రేజ్ మరే సినిమా కూడా దక్కించుకోలేదనే చెప్పాలి.

టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికితోడు మిర్చి, శ్రీమంతుడు వంటి సినిమాలను తెరకెక్కించిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అభిమానులు ఎన్టీఆర్‌ను ఎలా అయితే చూడాలని అనుకున్నారో అచ్చం అలాగే కనిపిస్తాడు ఈ సినిమాలో. ఫస్టాఫ్ మొత్తం క్లాస్ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు తారక్. ఇక సెకండాఫ్‌లో తన నటనతో కథను పీక్స్‌కు తీసుకెళ్లాడు యంగ్ టైగర్. మళయాల సూపర్‌స్టార్ మోహన్‌ లాల్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తన యాక్టింగ్‌తో పాటు డైలాగ్ డెలివరీతో మోహన్‌ లాల్ చూపించిన పర్ఫార్మెన్స్ నిజంగా అద్భతుం. సమంత, నిత్యా మీనన్‌లు తమకు ఉన్న పరిధిలో నటించి ఆడియెన్స్‌ను మెప్పించడంలో మరోసారి హిట్ అయ్యారు.

అలాంటిది ఇన్నాళ్ళకి జనతాగ్యారేజ్ తో తిరిగి సింహాద్రిని మరిపించగలిగాడు యంగ్ టైగర్. జనతాగ్యారేజ్ సినిమాలో సింహాద్రి రేంజ్ యాక్షన్ లేకపోయినా సోషల్ మెసేజ్ ని అందరికీ నచ్చేలా చెబుతూ ఆ కథలోనే ఎంతవరకు ఫైట్స్ అవసరమే అంతవరకే వాడుకున్నాడు కొరటాల శివ.

దాంతో సినిమా ఒక్క ఎన్టీఆర్ అభిమానులకే కాదు సామాన్య ప్రేక్షకులకు కూడా నచ్చడంతో ఇప్పుడు సింహాద్రి రేంజ్ విజయం ఎన్టీఆర్ ఖాతాలో పడటం ఖాయం అంటున్నారు. ఇలాంటి సినిమా ఎన్టీఆర్ కి ఇచ్చినందుకు కొరటాల శివకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.

లేబుళ్లు: ,