సంక్రాంతికి విడుదల కాబోతున్న 'రాజాసాబ్' సినిమా జనవరి 9న విడుదల కానుంది, 8న ప్రీమియర్లు ఉంటాయి. సినిమా ప్రమోషన్లు మొదలయ్యాయి. ఇప్పటికే టీజర్, ట్రైలర్ విడుదలయ్యాయి, ఒక పాట కూడా విడుదల చేశారు. తాజాగా 'సుహానా' అనే రెండో పాట విడుదలైంది. తమన్ సంగీతం అందించిన ఈ పాట వినడానికి బాగుంది. బాలీవుడ్ సింగర్ విశాల్ మిశ్రా పాడటం వలన పాటకు కొత్తదనం వచ్చింది. ఈ పాట గ్రీస్‌లో షూట్ చేశారు, అక్కడ లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి. ప్రభాస్ లుక్స్, స్టైల్, డ్యాన్స్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. నిధి అగర్వాల్ కూడా ఈ పాటలో ప్రభాస్‌తో కలిసి డ్యాన్స్ చేసింది.
ప్రభాస్ చాలా కాలం తరువాత డ్యాన్స్ చేసే ఒక మాస్ బీట్ పాట సినిమాలో ఉంది. ఈ పాటలో ముగ్గురు హీరోయిన్లతో కలిసి ప్రభాస్ డ్యాన్స్ చేశాడు. తమన్ సంగీతం అందించిన ఈ పాట అభిమానులకు బాగా నచ్చుతుంది. సినిమా ప్రీ-రిలీజ్ వేడుక ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరపడానికి చిత్రబృందం ప్రభుత్వ అనుమతుల కోసం ప్రభుత్వాన్ని చిత్రబృందం సంప్రదిస్తోంది. పర్మిషన్లు రాగానే పనులు ప్రారంభిస్తారు..
Rajasab

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి