లిక్కర్ స్కాం.. డిప్రెషన్ లో హీరోయిన్

kayadu lohar breaks-down over liquor scam allegations
CinemaTelugu

 

తమిళనాడు లో మద్యం కుంభకోణం సంచలనం రేపింది. సుమారు రూ. 1000 కోట్లకు పైగా మద్యం స్కామ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈడీ విచారణలో హీరోయిన్ కయాదు లోహర్‌ పేరు తెరపైకి వచ్చింది. చెన్నైలోని టాస్మాక్‌ ప్రధాన కార్యాలయంతో పాటు ప్రైవేటు మద్యం ఫ్యాక్టరీలో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్నవారు నిర్వహించిన నైట్ పార్టీలకు వచ్చినందుకుగాను కయాదు లోహర్‌ కి రూ.35 లక్షలు చెల్లించినట్లు ఒప్పందం కుదిరినట్లు కథనాలు వచ్చాయి. ఈ వార్త సౌత్ సినీ పరిశ్రమలో వైరల్‌ అయ్యింది.

ఈ కథనాలపై తాజాగా స్పందించింది కయదూ. ఈ వార్తలని పూర్తిగా ఖండించారు. ‘ఈ వార్తలు నన్ను బాధించాయి. ఆ వార్తలు చూసి నేనెంతో బాధపడ్డా. హీరోయిన్ గా స్థిరపడాలనే నా డ్రీం. ఇప్పుడిప్పుడే నా కెరీర్ ఒక గాడిలో పడుతోంది. ఈ సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం బాధించింది. ఈ వార్తలన్నీ అవాస్తవాలు. ఇవి రూమర్స్ అయినప్పటికీ నన్ను డిప్రెషన్ కి గురి చేశాయి’ అని చెప్పుకొచ్చింది కయాదు. ప్రదీప్ రంగనాథ్ తో చేసిన ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ సినిమా కయాదుకి మంచి ఫేం తీసుకొచ్చింది. విశ్వక్‌సేన్‌ ‘ఫంకీ’లో కూడా తనే హీరోయిన్. ఇవి కాకుండా ఆమె చేతిలో మరికొన్ని తమిళ క్రేజీ ప్రాజెక్ట్స్ వున్నాయి.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
Site is Blocked
Sorry! This site is not available in your country.