క్షమాపణ చెప్పిన ఐబొమ్మ.. ఇదేనా లాస్ట్ మెసేజ్

ibomma ibommapiracy raviarrest telugucinema hyderabadpolice piracynews
CinemaTelugu

 IBOMMA ఈ నేపథ్యంలో ఐబొమ్మ వెనకున్న మాస్టర్ మైండ్ రవి అరెస్టైన వేళ.. ఆ వెబ్ సైట్ లో దర్శనమిస్తోన్న మెసేజ్ ఈ సందర్భంగా వైరల్ అయ్యింది.






"ఐబొమ్మ" ఇప్పుడు భారతదేశంలో, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత హాట్ టాపిక్ అనే సంగతి తెలిసిందే. పోలీసుల కు ఛాలెంజ్ చేసిన ఐబొమ్మ మాస్టర్ మైండ్ రవిని పోలీసులు నెలల వ్యవధిలోనే అరెస్ట్ చేసి తమ సత్తా చూపించారు. రాజమౌళి లాంటి దర్శకుడు "పోలీసులతో ఆటలొద్దని" చెబుతూ రవి పరిస్థితిని భస్మాసురిడితో పోల్చారు. ఈ నేపథ్యంలో ఐబొమ్మ నుంచి లాస్ట్ మెసేజ్ వచ్చింది

అవును... పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... 2019లో ఐబొమ్మ ప్రారంభించి 21 వేల సినిమాలు పైరసీ చేశాడని తెలిపారు. ఇందులో ‘గాడ్ ఫాదర్’ నుంచి ‘ఓజీ’వరకూ ఉన్నాయని వెల్లడించారు.

Megastar chiranjeevi : ఇదే సమయంలో.. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ... లైట్ బాయ్ నుంచి సినిమా థియేటర్ ముందున్న గేట్ కీపర్ వరకూ లక్షల మంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే.. పైగా ఎదురు సవాళ్లు విసురుతుంటే అది తట్టుకోలేని పరిస్థితి అని, ఇలాంటి వాటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్న సమయంలో పోలీసులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. అదేవిధంగా... పైరసీ సినిమాల వెనుక అంతర్జాతీయ రాకెట్, అంతర్జాతీయ మోసం ఉందని.. పైరసీ సినిమా వెబ్ సైట్ నిర్వాహకులు.. జనాలకు ఉచితంగా సినిమాలు చూపించాలని కాదని, దీని వెనుక బిగ్ ప్లాన్ ఉంటుందని, ఇందులో భాగంగా వేల కోట్ల రూపాయలు సంపాదన లక్ష్యం ఉంటుందని, పైరసీ సినిమాల వ్యవహారం బిగ్ ట్రాప్ అని వెల్లడించారు.



ఈ నేపథ్యంలో ఐబొమ్మ వెనకున్న మాస్టర్ మైండ్ రవి అరెస్టైన వేళ.. ఆ వెబ్ సైట్ లో దర్శనమిస్తోన్న మెసేజ్ ఈ సందర్భంగా వైరల్ అయ్యింది. దీంతో.. రవి ఐతే అరెస్టయ్యాడే కానీ.. దీని వెనకున్న పెద్ద టీమ్ ఇంకా ఆన్ డ్యూటీలోనే ఉన్నట్లున్నారనే చర్చ మొదలైంది. రవి కేవలం భారత్ కు సంబంధించిన మనిషే.. ఈ నెట్ వర్క్ వరల్డ్ వైడ్ ఉందనే చర్చ మొదలైంది. దానికి కారణం ఈ చివరి మెసేజ్! ప్రస్తుతం ఐబొమ్మ సైట్ లో... "ఇటీవల మా గురించి వినే ఉంటారు.. మొదటి నుంచీ మా విశ్వాసనీయ అభిమానిగా ఉన్నారు.. ఏది ఏమైనా మా సేవలను దేశంలో (భారత్ అయ్యి ఉండోచ్చు!) శాశ్వతంగా నిలిపేసున్నాం.. అందుకు చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నాం" అనే చివరి సందేశం కనిపిస్తోంది. ఇది కాస్తా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొత్త చర్చకు దారి తీసింది!


Tags: ibomma ibommapiracy raviarrest telugucinema hyderabadpolice piracynews 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
Site is Blocked
Sorry! This site is not available in your country.