ఇందులో భాగంగా వైజాగ్‌లో `జాజికాయ` అంటూ సాగే లిరికల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఈవెంట్‌లో బాలయ్య ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఓ కాంబినేషన్‌లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలు వేరుగా ఉంటాయి. అలాంటి కాంబినేషనే నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీనులది. వీరిద్దరి కలయికలో ఇప్పటి వరకు సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలొచ్చాయి. ఈ మూడు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచి వీరి కాంబినేషన్‌కు హ్యాట్రిక్ విజయాల్ని అందించాయి.
దీంతో వీరికలయికలో సినిమా అంటే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. `అఖండ` వరకు వరుసగా మూడు సినిమాలు విజయం సాధించడంతో అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ ఈ కాంబినేషన్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వస్తున్న మరో మూవీ `అఖండ 2`. సంచలన మూవీ `అఖండ`కు సీక్వెల్‌గా దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే `అఖండ 2` వరకు వచ్చే సరికి అంచనాలు కాస్తా పీక్స్ కు చేరుకోవడమే కాకుండా ఈ సారి ఇద్దరూ గట్టిగా కొట్టాల్సిందే అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
కారణం పాన్ ఇండియా టార్గెట్, హిందుత్వ, సనాతన ధర్మం కార్డ్..ఈ టార్గెట్‌లేవీ `అఖండ`కు లేవు. కానీ `అఖండ 2`కు మాత్రం ఇవే టార్గెట్‌లు కాబట్టి గట్టిగా కొట్టక తప్పదు. దీనికి తోడు బాలయ్య, బోయపాటి సనాతన హైందవ ధర్మం శక్తిని, పరాక్రమాన్ని, గౌరవాన్ని `అఖండ 2`లో చూస్తారని చెప్పేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాతో పాన్ ఇండియాని టర్గెట్ చేశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. డిసెంబర్ 5న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
ఇందులో భాగంగా వైజాగ్‌లో `జాజికాయ` అంటూ సాగే లిరికల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ఈవెంట్‌లో బాలయ్య ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. `నాది.. బోయపాటిది సినిమా వస్తోందంటే ఇంటగెలిచినట్లే.. ఇప్పుడు `అఖండ 2`తో రచ్చగెలిచేందుకు సిద్ధమవుతున్నాం. అఖండ పాటతో తొలి దెబ్బని హిందీకి రుచి చూపించాం` అంటూ బాలయ్య చేసిన కామెంట్ `అఖండ 2` టార్గెట్ ఏంటనేది స్పష్టం చేస్తోంది. అయితే ఈ ఫీట్ అనుకున్నంత ఈజీ కాదన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.
హిందీ బెల్ట్ నచ్చితే నెత్తినెత్తుకుంటారు. నచ్చలేదో పాతాళంలో పడేస్తారు. అయితే ఇప్పుడు హిందుత్వ సెంటిమెంట్ బలంగా వీస్తున్న నేపథ్యంలో `అఖండ 2` అక్కడ రికార్డులు బద్దలు కొట్టడం ఏమంత కష్టమేమీ కాదన్నది ట్రేడ్ వర్గాల మాట. అయితే కంటెంట్ అనుకున్న విధంగా బలంగా ఉంటే మాత్రం హిందీ బెల్ట్‌లో బాలయ్య, బోయపాటి అనుకున్నట్టుగానే గట్టిగా కొట్టడం నల్లేరు మీద నడకే అవుతుందని ఇన్ సైడ్ టాక్. ఏది ఏమైనా ఈ సారి పాన్ ఇండియా పదం ఎత్తుకున్నారు కాబట్టి ఎక్కడా తడబాటు లేకుండా బాలయ్య, బోయపాట `అఖండ 2`తో గట్టిగా కొట్టక తప్పని పరిస్థితి. మరి బోయపాటి ఏం చేస్తాడో తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వేచి చూడాల్సిందే.
Tags: NandamuriBalakrishna, Akhanda2, Boyapatisrinu, balayyaspeechviral