రామ్ పోతినేని 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా ప్రమోషన్స్ మామూలుగా లేవు. సినిమాపై ఉన్న నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ ప్రచారంలో సరికొత్త దారులు వెతుకుతున్నారు.
రామ్ పోతినేని 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా ప్రమోషన్స్ మామూలుగా లేవు. సినిమాపై ఉన్న నమ్మకంతో మైత్రీ మూవీ మేకర్స్ ప్రచారంలో సరికొత్త దారులు వెతుకుతున్నారు. ఇందులో భాగంగా నిన్న కర్నూలులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఈవెంట్స్ అంటే స్టేజ్ మీద స్పీచ్‌లు కామన్, కానీ ఈసారి టీమ్ అంతకుమించి ఆలోచించింది. ఆకాశాన్ని స్క్రీన్‌గా మార్చేసి ఒక విజువల్ వండర్‌ను క్రియేట్ చేసింది.
ఈ ఈవెంట్‌కు ప్రధాన ఆకర్షణ 'డ్రోన్ షో' అనే చెప్పాలి. టాలీవుడ్ చరిత్రలోనే ఇది మొదటిసారి. దాదాపు 1000కి పైగా డ్రోన్స్‌ను ఉపయోగించి కర్నూలు నైట్ స్కైలో అద్భుతాలు సృష్టించారు. ఒకేసారి వెయ్యి డ్రోన్లు గాల్లోకి ఎగిరి లైట్ల వెలుగులతో రకరకాల ఆకారాలుగా మారుతుంటే, కింద ఉన్న లక్షలాది మంది ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోయారు. టెక్నాలజీని ప్రమోషన్స్ కోసం ఇంత క్రియేటివ్ గా వాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.ముఖ్యంగా ఆ డ్రోన్స్ అన్నీ కలిసి ఆకాశంలో సినిమా టైటిల్ 'ఆంధ్ర కింగ్ తాలూకా' అని తెలుగులో ఫామ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత డ్రోన్స్ తోనే సినిమా రిలీజ్ డేట్ ను డిస్ప్లే చేయడం ఈ షోకే హైలైట్‌గా నిలిచింది. స్కైలో ఆ లైటింగ్ ఎఫెక్ట్స్, ఆ ఫార్మేషన్స్ చూస్తుంటే ఏదో ఇంటర్నేషనల్ ఈవెంట్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది.
