ఓవర్సీస్ మార్కెట్లో “మజిలీ”కి దెబ్బ పడేలా ఉంది గా..!


ఓవర్సీస్ మార్కెట్లో “మజిలీ”కి దెబ్బ పడేలా ఉంది గా..! 
గత కొంత కాలం నుంచి చూస్తున్నట్టయితే అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య గ్రాఫ్ అస్సలేం బాగోలేదనే చెప్పాలి.హిట్ కోసం చై ఏది ట్రై చేసినా అది ఆఖరికి బెడిసి కొడుతుంది.దీనితో ఈ సారి ఎలా అయినా సరే సరైన హిట్ అందుకొని అక్కినేని అభిమానులను ఫుల్ ఖుష్ చేద్దామనుకుంటే ఓవర్సీస్ మార్కెట్ లో దెబ్బ పడేలా ఉందని తెలుస్తుంది.ఇప్పుడు నాగ చైతన్య మరియు సమంత జంటగా “నిన్ను కోరి” లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో “మజిలీ” అనే సినిమా ఈ నెల 5న విడుదల కానుంది.
విడుదలైన ట్రైలర్ కు ఎక్కడ చూసినా సరే మంచి రెస్పాన్స్ వస్తుంది.దీనితో ఈసారి మాత్రం చైతు అక్కినేని అభిమానులను కాలర్ ఎగరేసేలా చేస్తాడని అందరు భావిస్తుండగా సినిమా విడుదల కూడా ఇంకా ఒక్క రోజు సమయమే మిగిలి ఉండగా ఈ సినిమా పాజిటివ్ వేవ్ కి బ్రేక్ పడిందని తెలుస్తుంది.ఓవర్సీస్ మార్కెట్ లో ప్రీమియర్ షోలకు కూడా సిద్ధంగా ఉన్న ఈ సినిమాని కొనేందుకు కొంత మంది మినహా ఎవరు ముందుకు రావట్లేదట. ఎందుకంటే నాగచైతన్య గత మూడు సినిమాలు “యుద్ధం శరణం”,”సవ్యసాచి” మరియు “శైలజ రెడ్డి అల్లుడు” వరుస ప్లాపులుగా నిలిచాయి.
దీనితో చై మార్కెట్ ఓవర్సీస్ లో బాగా దెబ్బ తినేసింది.ఈ ఎఫెక్ట్ ఇప్పుడు “మజిలీ” పై పడిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.ఇంకా విడుదలకు ఒక్క రోజు మిగిలే ఉన్నా ఈ సినిమాను కొనేందుకు ఎవరు ముందుకు రాకపోతుండడంలో ఓవర్సీస్ మార్కెట్లో మజిలీ సినిమాకు పెద్ద దెబ్బే పడేలా ఉందని సినీ వర్గాలు చెప్తున్నాయి.మరి చై అక్కడ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

కామెంట్‌లు