పవన్ మల్లెల అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ''బాలకృష్ణుడు'' సినిమాలో ఒక చిలిపి మాస్ హీరోగా నటిస్తున్నాడు నారా రోహిత్. ట్రైలర్ చూస్తే.. రెజీనాతో మనోడు పండించిన రొమాన్స్.. కత్తిలాంటి ఫైట్స్.. అలాగే కమెడియన్ పృధ్వీ కాంబినేషన్లో వచ్చిన సీన్లు అదిరిపోయాయ్. ఊర మాస్ హీరోగా తన స్థాయిని చాటుకోవాలని చేస్తున్న ప్రయత్నంలో రోహిత్ కామెడీ టైమింగ్ కూడా అదిరింది. అయితే ఇదొక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాపులో సాగే యాక్షన్ కథ. అందుకే ట్రైలర్ చివర్లో శ్రీనివాస్ రెడ్డి వాయిస్ లో.. మంచి ఫ్యాక్షన్ సినిమా చూసి చాలా కాలమైంది అనే లైన్ కూడా సింబాలిక్ గా చెప్పించారు. అయితే అక్కడ మాసిన గెడ్డంలో కృష్ణుడి గెటప్ వేశాడు చూడండి.. అబ్బో రోహిత్ అక్కడ భలే ఉన్నాడు.
నిర్మాత మహేంద్ర పెట్టిన ఖర్చు.. మణిశర్మ మ్యూజిక్.. సినిమా బాగా ప్లస్సనే చెప్పాలి. ఏ సినిమాలూ లేని టైములో వచ్చేసి.. ఇలాంటి మాస్ సినిమాలతో పెద్ద హిట్టు కొట్టేసే ఛాన్సులు అనేకం ఉంటాయి. చూస్తుంటే రాబోయే రెండు మూడు వారాల్లో రోహిత్ కూడా అదే చేస్తాడేమో అనిపిస్తోంది.
