ఇక అసలు విషయంలోకి వస్తే టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ కూడా సెంటిమెంట్స్ ని బాగా ఫాలో అవుతారు. పద్ధతులను ఆయన అస్సలు మిస్ అవ్వరు. ఆయనకి దైవ భక్తి కూడా చాలా ఎక్కువే అని అందరికి తెలిసిన విషయమే. సెంటిమెంట్స్ విషయంలో అయితే బాలయ్య బాబు ఏ మాత్రం తేడా రానివ్వరు. తేడా వస్తే ఆ రోజు చేసేపని క్యాన్సిల్ చేసుకుంటారట. ముఖ్యంగా బాలయ్య కాస్ట్యూమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని తెలుస్తోంది. ప్రతి గురువారం ఆయన కొత్త కాస్ట్యూమ్ ని దరించడానికి అస్సలు ఇష్టపడరట. గత 15 ఏళ్ల నుంచే ఆయన ఈ రూల్ ని మరచిపోకుండా పాటిస్తున్నారాని ఆయన సన్నిహిత కాస్ట్యూమ్ డిజైనర్ ద్వారా తెలిసింది.
ఆయన టైమ్ టేబుల్ ని కరెక్ట్ గా ఫాలో అవుతారు. షూటింగ్ కి అరగంట ముందే వచ్చి ఆ తర్వాత అవసరమైతే ఎక్కువ సేపు వర్క్ చేయడానికి ఇష్టపడతారట. అయితే ఈ క్రమంలో అనుకోకుండా గురువారం కొత్త కాస్ట్యూమ్ ని ధరిస్తే వెంటనే షూటింగ్ క్యాన్సిల్ అనేస్తారట. మరి ఎమర్జెన్సీ ఉంటే ఎలా సర్ అంటే..అందుకు ఒక సెంటిమెంట్ ఐడియా ని కూడా బాలయ్య పెట్టుకున్నారట. గురువారం వేసుకోవాల్సిన కొత్త కాస్ట్యూమ్ ని బుధవారం రోజు ఇస్తే ఒక అరగంట పాటు వేసుకుంటే అది ఓల్డ్ అయిపోతుంది కదా.. సో ఆ విధంగా బాలయ్య తన గురువారం సెంటిమెంట్ ని క్లియర్ గా ఫాలో అవుతారని తెలుస్తోంది.
