‘జై’ తొక్కుడుకు దద్దరిల్లిన యూట్యూబ్..!!


'టెంపర్’ సినిమా దగ్గరనుంచి యూట్యూబ్ మీద దండయాత్ర ప్రారంభించిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్.. సినిమా సినిమాకి సరికొత్త మైల్‌స్టోన్స్ క్రియేట్ చేస్తూ తన సత్తా చాటుకుంటూ వస్తున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’ల టీజర్, ట్రైలర్స్‌తో వరుసగా 5 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసి.. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు హీరోగా సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ‘జై లవకుశ’తో టాలీవుడ్‌లోనే ఎవ్వరూ సాధించని తిరుగులేని రికార్డ్‌ని తారక్ సొంతం చేసుకున్నాడు.


చేసిన టీజర్‌కి ఏ రేంజులో రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలుసు. అతి తక్కువ సమయంలోనే 1M, 5M, 10M (M-మిలియన్) మార్కుల్ని క్రాస్ చేసేసి.. ఆ టీజర్ ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ టీజర్ మరో రేర్ ఫీట్ అందుకుంది. ఏకంగా 19 మిలియన్ మార్క్‌ని క్రాస్ చేసేసింది. తెలుగులో ఏ సినిమా టీజర్ ఈ ఘనత సాధించలేదు. నవయుగ రావణుడిగా తారక్ తన నటవిశ్వరూపం చూపించడంతో నెటిజన్లు ఆ వీడియోకి ఫిదా అయిపోయి ఎగబడటంతో.. ఆ టీజర్ ఇలా యూట్యూబ్ మీద దండయాత్ర చేసి చరిత్ర సృష్టించింది. ఇక ఫీట్ అందుకున్న తొలి తెలుగు హీరోగా తారక్ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇదిలావుండగా.. ఈ చిత్రం ఇటు వసూళ్ల పరంగానూ ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద 16 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.131 కోట్లు గ్రాస్, రూ.77 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. విశేషం ఏమిటంటే.. బరిలో వున్న ‘స్పైడర్’, ‘మహానుభావుడు’ సినిమాలకంటే అత్యధిక వసూళ్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది.