‘మాస్’కు మాంచి ‘ఐటెం’ నెంబర్!


జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే మాస్ స్టెప్పులు లేకుండా ఊహించుకోవడం అసాధ్యం కదా! అవును… ‘జై లవకుశ’ సినిమాలో అలాంటి మాస్ పాట కోసం ఎదురుచూసిన వారికి ఫీస్ట్ లా మారింది తమన్నా ఐటెం సాంగ్. ‘స్వింగ్ జర’ అంటూ ఈ సాగిన ఈ పాటలో మిల్కీ బ్యూటీ సౌందర్యంతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు బి,సి సెంటర్స్ లో ఊపేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

మాస్ వర్గాల్లో మాంచి పట్టు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ పాట ఒక రేంజ్ లో ఎక్కేస్తుందని సినిమా విడుదలైన తర్వాత తేలింది. నిజానికి ఆడియో పరంగా ఈ పాట గొప్పగా లేకపోయినా, జూనియర్ ఎన్టీఆర్ మాస్ స్టెప్పులు, తమన్నా సోయగాల చిత్రీకరణతో మరో స్థాయికి తీసుకువెళ్ళారు. ఈ పాట తర్వాత సినిమాలో విజువల్ గా ‘ట్రింగ్ ట్రింగ్’ పాట చూడముచ్చటగా ఉంటుంది. ‘జనతా గ్యారేజ్’లోని ‘యాపిల్ బ్యూటీ’ మాదిరి కనపడే ‘ట్రింగ్ ట్రింగ్’ పాటలో కోరియోగ్రఫీ బాగుంటుంది.

దానికి తారక్, రాశి ఖన్నాల ఫ్రెష్ నెస్ యాడ్ అయ్యింది. ఇక ఆడియోలో హైలైట్ అయిన ‘రావణా…’ పాట టీజర్లో చూపించిన విధంగానే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చి వెళ్ళిపోతుంది. నివేదా థామస్, కుశ ఇంట్రడక్షన్ సాంగ్స్ రెగ్యులర్… వీటి గురించి చెప్పుకోవడానికేం లేదు. విజువల్ గా పాటల్లో హైలైట్స్ అంటే… స్వింగ్ జరా అండ్ ట్రింగ్ ట్రింగ్!