టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ కోసం టోటల్ టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా సినిమాలో ఎన్టీఆర్ మూడు డిఫెరెంట్ రోల్స్ చేస్తుండటం తో అంచనాలు కూడా పీక్స్ లో ఉన్నాయి. ఆ అంచనాలను తగ్గట్లే సినిమా కూడా అన్ని హంగుల తో రూపొందు తుంది. కాగా ప్రస్తుతం టాకీ పార్ట్ మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లో ఇప్పుడు కేవలం 2 సాంగ్స్ షూటింగ్ మాత్రమె బాలెన్స్ ఉంది.
కాగా ఆ సాంగ్స్ లో ఒకటి దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఊరమాస్ ఐటమ్ సాంగ్ ఉండటంతో ఆ ఐటమ్ సాంగ్ లో నటించే హీరోయిన్ కోసం చాలా కాలంగా వేట కొనసాగుతుంది..ఎంతో మంది కొత్త నుండి టాప్ హీరోయిన్స్ ని ఐటమ్ సాంగ్ లో అనుకోగా ఎవ్వరూ ఎన్టీఆర్ తో చేయడానికి సాహ సించ లేదు.. ముఖ్యంగా కాజల్ అగర్వాల్, సమంత లాంటి టాప్ హీరోయిన్స్ ఎన్టీఆర్ తో చేయడం మా వల్ల కాదని చేతులెత్తేశారట. దాంతో టాప్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ను ఈ ఐటమ్ సాంగ్ లో తీసుకోవాలని ట్రై చేసినా తను కూడా నా వల్ల కాదని చెప్పే సిందట.
దాంతో ఇప్పుడు ఎలా అనుకుంటున్న సమయం లో ఎన్టీఆర్ తో ఊసరవెల్లి సినిమా లో అద్బుతంగా నటించిన తమన్నా ని ఇప్పుడు జైలవకుశ సినిమా లో ఐటమ్ సాంగ్ కి ఒప్పించి నట్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా కి సుమారు 50 లక్షలకు పైగా ఇచ్చి ఈ ఐటమ్ సాంగ్ ని చేయిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు…ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరో గా ఓ సినిమా కి కూడా హీరోయిన్ గా ఒప్పుకుంద ట కాజల్.
దాంతో ఎన్టీఆర్ తో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్న తమన్నా త్వరలో నే సాంగ్ షూటింగ్ లో పాల్గొన బోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం హీరోయిన్స్ లో బెస్ట్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న తమన్నా…హీరో లలో బెస్ట్ డాన్సర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న యంగ్ టైగర్ తో డాన్స్ కి సిద్ధం అవ్వడం తో వీరి కలయిక లో వచ్చే ఈ సాంగ్ కి థియేటర్ లు దద్దరిల్లి పోవడం ఖాయమని యూనిట్ వర్గాలు చెబుతుండటం విశేషం…దేవి శ్రీ ప్రసాద్ కెరీర్ బెస్ట్ ఐటమ్ సాంగ్స్ లో ఒకటిని ఈ సినిమా కోసం ఇచ్చాడ ట…
మరి వీళ్ళ రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో సినిమా రిలీజ్ అయ్యాక తెలియ నుండి.
