అర్జున్ రెడ్డి’పై అనసూయ ట్విట్టర్ వార్


ఇటీవల విడుదలైన 'అర్జున్ రెడ్డి' సినిమా విషయంలో చాలా రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమా ఓ వైపు సూపర్ హిట్ టాక్‌తో దూసుకెలుతున్నప్పటికీ, సినిమాపై కొందరు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ చిత్రం యువతను చెడగొట్టే విధంగా ఉందని, బూతు సీన్లు, బూతు పదాలు ఉన్నాయంటూ చాలా గొడవ జరగుతోంది.

ప్రముఖ యాంకర్, నటి అనసూయ కూడా 'అర్జున్ రెడ్డి' సినిమాపై విమర్శలు చేశారు. ఈ సినిమాలో వాడిన కొన్ని బూతు పదాలపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో హీరో ఎవరినో తిట్టేక్రమంలో అమ్మను ఉద్దేశించి బూతు పదాలు పయోగించడంపై అనసూయ మండి పడుతున్నారు.


ట్విట్టర్లో వార్
అనసూయ ఈ కామెంట్స్ చేయడంతో ట్విట్టర్లో అర్జున్ రెడ్డి సినిమా అభిమానులు ఆమెపై దాడి చేయడం మొదలు పెట్టారు. మీ బజర్దస్త్ లో మహిళలను కించ పరుస్తూ చాలా స్కిట్లు చేస్తున్నారు. జబర్దస్త్ ను మించిన బూతు ఈ సినిమాలో ఏమీ లేదు అంటూ ఆమె కామెంట్లకు కౌంటర్ ఇస్తున్నారు.
హైపోక్రైట్ అంటూ విమర్శలు
ఈ క్రమంలో చాలా మంది అనసూయపై ఆమె హైపోక్రైట్ అంటూ విమర్శలు చేస్తున్నారు. తాను చేస్తున్న టీవీ షోలలో కావాల్సినంత బూతు ఉంటోంది, అలాంటి వ్యక్తి అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలు చేయడం ఏమిటీ అంటూ మండి పడుతున్నారు.