రజనీ మూవీ లో తెలుగు సీనియర్ నటి

కబాలి ఫేమ్ పా. రంజిత్ – రజనీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కాలా’ చిత్ర షూటింగ్ ఇటీవలే ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెల్సిందే.. జూన్ 23 నుండి రెండోవ షెడ్యూల్ చెన్నైలో మొదలుపెట్టుకోబోతుంది..ఈ మూవీ లో తెలుగు సీనియర్ నటి ఈశ్వరి రావు కు ఛాన్స్ దక్కినట్లు సమాచారం. ఈ మధ్యనే అ..ఆ , నేను లోకల్ వంటి చిత్రాల్లో మంచి పాత్రలు దక్కించుకొని ప్రేక్షకులను అలరించిన ఈమెకు , ఇప్పుడు కాలా లో కూడా మంచి పాత్ర దక్కిందని అంటున్నారు.
eswari rao to play rajinikanth wife
 నానా పటేకర్, హుమా క్యూరేషి , అంజలి పాటిల్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు ఈ మూవీ లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ రజనీకి జోడీ కడుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ తో అభిమానుల్లో అంచనాలు మొదలు అయ్యాయి.కబాలి తో హిట్ కొట్టలేక పోయిన రంజిత్ ఈ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసి ఉన్నట్లు తెలుస్తుంది.