టాలీవుడ్ లో అడుగుపెట్టే ప్రతీ హీరోయిన్ అందరికన్నా ముందుగా కామెంట్ చేసే హీరోలలో ఎన్టీఆర్ ముందు వరుసలో నిలుస్తాడు. టాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రతీ హీరోయిన్ ని మీ ఫేవరేట్ హీరో ఎవరు ఎవరితో వర్క్ చేయాలి అనుకుంటున్నారు అని అడగడం కామనే.
రీసెంట్ గా గురు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన చిన్నది రుతికని కూడా రీసెంట్ గా ఇంటర్వ్యూలో ఏ హీరోతో నటించాలని ఉంది అన్న ప్రశ్నకి తడుముకోకుండా ఎన్టీఆర్ తో నటించడానికి ఎదురుచూస్తున్నాను అని చెప్పిందట అమ్మడు.
ఎన్టీఆర్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ అని అలాంటి నటుడితో నటించడం కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పడంతో ఎన్టీఆర్ అభిమానుల మనసుని గెలుచుకుంది ఈ బ్యూటీ. గురు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అవ్వడంతో తెలుగులో ఈమెకి మరిన్ని అవకాశాలు ఖాయమని అంటున్నారు. అందులో ఎన్టీఆర్ తో చాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
