టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ టెంపర్ కి ముందు వేరు…టెంపర్ తర్వాత వేరు అని చెప్పొచ్చు. టెంపర్ నుండి ఒక్కో సినిమాతో తన క్రేజ్ ని పెంచుకుంటూ ఇప్పుడు శిఖరాగ్రాన చేరుకున్నాడు యంగ్ టైగర్.
ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని ప్రతీ చిన్న సినిమాలో ఎన్టీఆర్ రిఫెరెన్స్ లతో సీన్స్ ని తీయడం మొదలుపెట్టేశారు….రీసెంట్ గా ఎన్టీఆర్ నాన్నకుప్రేమతోని నిర్మించిన BVSN ప్రసాద్ నిర్మించిన సరికొత్త సినిమా రాధలో ఎన్టీఆర్ నాన్నకుప్రేమతోని స్పూఫ్ చేశారు.
కాగా ఈ సీన్ లో ఎన్టీఆర్ పేరు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయే రేంజ్ లో అరుపులతో హోరెత్తిందని చూసినవాళ్ళు చెబుతున్నారు. ఒక్క ఈ సినిమా అనే కాదు ఈ మధ్య చాలా సినిమాల్లో ఎన్టీఆర్ రిఫెరెన్స్ లో ఓ రేంజ్ లో వర్కౌట్ అవుతున్నాయని చెప్పొచ్చు..జైలవకుశ అంచనాలను అందుకుంటే ఈ రచ్చ మరింతగా ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీలో చెబుతున్నారు.
