‘జై లవకుశ’ చరిత్రలో నిలిచిపోయే సినిమా… అభిమానులకి త్రిబుల్ కిక్

ntr jai lavakusa release date


‘జై లవకుశ’ షూటింగ్‌ అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకున్నా ఫర్వాలేదని మొదట అనుకున్నారు కానీ, ఇప్పుడు దసరా వరకు డిలే చేయకూడదని డిసైడ్‌ అయ్యారు. సోదరుడు కళ్యాణ్‌రామ్‌కి పెద్ద హిట్‌ ఇవ్వాలనే లక్ష్యంతో ఎన్టీఆర్‌ చేస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 1 రిలీజ్‌ టార్గెట్‌ చేస్తోంది. అయితే ఇప్పటికి పూర్తయిన షూటింగ్‌, ఇకపై జరగాల్సిన వర్క్‌ పోల్చి చూసుకుంటే, సెప్టెంబర్‌ 1కి రావడం కష్టమని అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోను సెప్టెంబర్‌ 1కి ఈ చిత్రం రిలీజ్‌ కావాలని ఎన్టీఆర్, డైరెక్టర్ బాబీ లతో సహా ‘జై లవకుశ’ టీమ్ మొత్తం అహో రాత్రులు ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధమవుతున్నారంట.

దసరా కి ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి.అప్పుడు సినిమా విడుదల చేయాలనుకోవడం పెద్ద మూర్ఖత్వమే.అందుకని ప్రాజెక్ట్ సేఫ్ కావాలంటే ముందుగా ప్రకటించినట్లు సెప్టెంబర్ 1 న అయితేనే చాలా బెటర్ అని ఫీల్ అవుతున్నారు. మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న కారణంగా మాములు సినిమాల కంటే తన పెర్ఫార్మన్స్ ఎక్కడా తగ్గకుండా ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడట. తన ఫ్యాన్స్ కి ఏమాత్రం నిరుత్సాహం కలగకుండా త్రిబుల్ కిక్ అందించేలా చేయాలని, అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కి ఒక సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ని అందించాలని అన్ని రకాలుగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.ఏది ఏమైనా అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఎప్పటికీ మరచిపోలేని సినిమా గా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని చెబుతున్నారు.