ఇప్పుడు ఇలా ఉండగా ఈమూవీ ఫస్ట్ లుక్ టీజర్ కు రంజాన్ సెంటిమెంట్ వెంటాడుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈనెల 23న శుక్రవారం రోజు ‘జై లవ కుశ’ టీజర్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది అని ఫిలింనగర్ టాక్. దీనికి కారణం గత ఏడాది ‘జనతా గ్యారేజ్’ కు రంజాన్ ఉన్న కనెక్షన్. క్రితం సంవత్సరం రంజాన్ కానుకగా ‘జనతా గ్యారేజ్’ టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సెంటిమెంట్ తోనే ఈఏడాది కూడా రంజాన్ టైమ్ కు తన కొత్త సినిమా టీజర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నాడట ఎన్టీఆర్. ఈమధ్యనే ‘జై లవ కుశ’ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ మూవీలో విలన్ గా కనిపించనున్న జై క్యారెక్టర్ ఫస్ట్ లుక్ తో విడుడుదల చేసినట్లుగా ఇప్పుడు ఈటీజర్ కోసం కూడ ‘జై’ క్యారెక్టర్ నే సెలక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈపాత్రకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ బూత్ బంగ్లా జైలు సెట్ లో కొన్ని సన్నివేశాలు పిక్చరైజ్ చేశారు. ఆ సన్నివేశాలలో కొన్నింటిని ఎంపిక చేసి ఈటీజర్ లో చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం జూనియర్ సినిమాలకు ఏర్పడిన భారీ క్రేజ్ రీత్యా ఈ సినిమాకు అప్పడే దాదాపు 80 కోట్ల వరకు బిజినెస్ అయిన నేపధ్యంలో ఈమూవీని భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు..
