లాస్య ‘యంఎల్‌ఏ’ చెల్లెలా?


యాంకర్‌గా బుల్లితెరపై సందడి చేసిన లాస్య నటిగా వెండితెరపై మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె నటించిన తొలి చిత్రం ‘రాజా మీరు కేక’ జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆమెకు కల్యాణ్‌రామ్‌ హీరోగా తెరకెక్కిస్తున్న ‘యంఎల్‌ఏ’లో నటించే అవకాశం దక్కింది. ఈ విషయాన్ని లాస్య ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ‘యంఎల్‌ఏ తొలిరోజు షూటింగ్‌ పూర్తైంది. కొంచెం బెరుకుగా అనిపించింది. కానీ బాగా జరిగింది. కల్యాణ్‌రామ్‌ సూపర్‌కూల్‌. వెన్నెల కిశోర్‌, దర్శకుడు ఉపేంద్ర మధ్వానీతో కలిసి సరదాగా పనిచేశాము.’ అన్నారు. ఇందులో లాస్య కల్యాణ్‌రామ్‌ చెల్లెలి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
‘యంఎల్‌ఏ’లో కల్యాణ్‌రామ్‌ సరసన కాజల్‌ నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమాన్ని నిర్విహించి, టైటిల్‌ ప్రకటించారు. మణిశర్మ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.