నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈరోజు ఉదయం కుటుంబ సభ్యులతో హాజరైన ఎన్టీఆర్ , తాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. తెలుగువారికి ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయన్నారు.
హరికృష్ణ మాట్లాడుతూ ..ఈరోజు తెలుగు వారికి పండుగ రోజు అన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశ పెట్టిన పథకాలే.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయని ఆయన చెప్పారు. స్త్రీలు ఒంటరిగా తిరుగుతున్నారంటే అది ఎన్టీఆర్ పాలన వల్లే అని ఆయన పేర్కొన్నారు. ఆయన అనుకున్నది సాధించి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని అన్నారు.
ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ, రామకృష్ణ సహా పలువురు కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.


