బ్రేకింగ్ న్యూస్…ఇండస్ట్రీని షేక్ చేస్తూన్న జైలవకుశ..!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జై లవ కుశ’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, ఈ సినిమాలో ఓ కథానాయికగా నటిస్తోన్న రాశిఖన్నా పాల్గొనగా పెళ్లి సీన్ చిత్రీకరిస్తున్నారట.
ఈ సినిమాకి సంబంధించిన శాటిలైట్ హక్కుల నిమిత్తం భారీ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ప్రముఖ చానెల్ జెమిని 14కోట్లు ఇచ్చి మరీ ఈ చిత్రం శాటిలైట్ హక్కులను దక్కించుకుందని సమాచారమ్. ఎన్టీఆర్ గత సినిమాల  కంటే ‘జై లవ కుశ’ శాటిలైట్ హక్కుల కోసం భారీ మొత్తం దక్కిందని చెప్పొచ్చు.

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని  నిర్మిస్తున్నారు. టేబుల్ ప్రాఫిట్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాని విడుదల చేస్తారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సో.. అన్నయ్యకు తమ్ముడు ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమాతో భారీ గిఫ్ట్ నే ఇస్తున్నాడని చెప్పొచ్చు.