ఎన్టీఆర్ పేరుకున్న పవర్ ఇది…

ntr-tollywood-ruler
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ…..ఇండస్ట్రీలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ అండ్ హాలీవుడ్ హేమాహేమీలు టెక్నీషియన్స్ గా పనిచేస్తున్న విషయం తెలిసిందే.


కాగా సినిమాలో ఎన్టీఆర్ లుక్స్, పోస్టర్స్, కొన్ని కాస్ట్యూమ్స్ కోసం ఇప్పుడు బాలీవుడ్ నుండి ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ కం ఫ్యాషన్ డిసైనర్ అయిన డబూ రత్నానిని తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇదివరకు ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ పోస్టర్స్ అండ్ కొన్ని కాస్టూమ్స్ ఈయనే డిసైన్ చేసినట్లు టాక్.


బాలీవుడ్ లో ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ కం ఫ్యాషన్ డిసైనర్ గా ఫుల్ డిమాండ్ ఉన్నా…సౌత్ లో ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు పిలిచినా రాని ఈయన కేవలం ఎన్టీఆర్ సినిమాల కోసం రావడం విశేషంగానే ఉందని అంతా అనుకుంటున్నారు. ఇదంతా ఎన్టీఆర్ క్రేజ్ వల్లే జరిగిందని అనుకుంటున్నారు అందరూ…