గెట్ రెడీ ఫర్.. నందమూరి 'రెడ్డి గారు'


నందమూరి బాలకృష్ణ.. ఒకప్పుడు ఆయన ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అంతేకాదు.. సమరసింహా రెడ్డి.. చెన్నకేశ రెడ్డి.. అంటూ రెడ్డి పేర్లను కూడా ఆయన ఇమ్మోర్టలైజ్ చేశారు. అలాంటి బాలయ్య ఈ మధ్యన రూటు మార్చి గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాను చేయడానికి అడుగులు వేశారు. ఆ సినిమా సక్సెస్ తరువాత అదే తరమాలో కొనసాగుతారని అనుకుంటే.. ఆయన మాత్రం మరోసారి కమర్షియల్ సినిమాలనే ఎంచుకున్నారు.

ఇప్పటికే పూరి జగన్ డైరక్షన్లో మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమా ఒకటి చేస్తున్న ఆయన.. తదుపరి కె.ఎస్.రవికుమార్ డైరక్షన్లో ఒక సినిమాను చేయడానికి సన్నద్దమవుతున్నారు. రజనీకాంత్ కోసం రెడీ చేసిన ఒక కథను ఇప్పుడు బాలయ్యతో చేస్తున్నారనే టాక్ ఉంది. అయితే ఈ సినిమాకు టైటిల్ ఏమని పెడితే బాగుంటుంది అని అనుకుంటున్న వేళ.. ''రెడ్డి గారు'' అనే టైటిల్ అయితే బాగుంటుందని ఫిక్సయ్యారట. ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు కాని.. ఈ టైటిల్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ వినిపిస్తోంది.

కాకపోతే ఈ టైటిల్ అభిమానులకు నచ్చినా కూడా ఆయన పొలిటికల్ శ్రేయోభిలాషులకు మాత్రం పెద్దగా కిక్కివ్వట్లేదు. ఎందుకంటే ఇలా ఒక సామాజిక వర్గానికి చెందిన పేరును టైటిల్ గా పెడితే.. తక్కిన సామాజిక వర్గాల వారు హర్టయ్యే ఛాన్సుంది కదా అంటున్నారు పొలిటికల్ అభిమానులు. చూద్దాం మరి బాలయ్య ఈ టైటిల్ కు ఓకె చెబుతారో లేదో.