మలయాళ నటి చర్మిల.. తన జీవితాన్ని పాడు చేసిన దుర్మార్గుడు అతడే అని సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది. 1990 టైమ్ లో.. సినిమాల్లో మెరిసిన ఈ భామ.. ఇప్పుడు గతాన్ని గుర్తు చేసుకుని మరీ ఆవేదన చెందుతోంది.
చర్మిల.. మొదలు బాబు ఆంటోనితో లవ్వాట నడిపింది. అది పెళ్లి వరకూ వెళ్లకపోవడంతో.. దర్శకుడు కిషోర్ సత్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. షార్జాలో కొన్నాళ్ల పాటు.. ఈ ఇద్దరి సంసారం కూడా బాగానే నడిచింది. కానీ.. చివరికి ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు రావడంతో.. విడాకులు తీసుకున్నారు.
ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న చర్మిల.. తన జీవితం గురించి చాలా బాధపడింది. కెరీర్ మంచి ఊపుమీదున్న టైమ్ లో.. విక్రమ్ తో నటించే అవకాశం వస్తే.. తన అప్పటి భర్త కిషోర్ సత్య వద్దని ఒత్తిడి చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఇదొక్కటే కాదు.. ఇంకా చాలా విషయాల కారణంగా.. తను ఇబ్బంది పడ్డట్టు చెప్పింది. తన జీవితాన్ని, కెరీర్ ను కిషోర్ సత్య నాశనం చేశాడని కామెంట్ చేసింది.
తన కెరీర్ కు కిషోర్ అడ్డు చెప్పకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. ఇది విన్నవాళ్లంతా పాపం చర్మిల అంటున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి