టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రకటనల్లో కనిపించడం కొత్తేమే కాదు. ఎప్పటి నుంచో ఉన్న ఈ ట్రెండ్ ఇప్పుడు కాస్త ఎక్కువైందంతే. కొన్ని బ్రాండ్స్ అయితే.. ఒకే హీరోను తమకు పర్మనెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా కంటిన్యూ చేసేస్తున్నాయి కూడా. అలాంటి వాటిలో ఎన్టీఆర్ చేసే నవరత్న ఆయిల్ బ్రాండ్ కూడా ఒకటి.
యంగ్ టైగర్ పై ఇప్పుడీ కంపెనీ కొత్త యాడ్ రూపొందించింది. గతంలో కూడా జూనియర్ ఈ కంపెనీ ప్రకటనల్లో చేశాడు కానీ.. ఈ సారి రూపొందించిన యాడ్ ఎవ్రీథింగ్ స్పెషల్ గా ఉంది. యాడ్ లో ''కూల్ రాజా''గా దర్శనం ఇవ్వడం నుంచి.. డ్యాన్స్ చేయడం.. పాట పాడడం కూడా తనే చేసేశాడు ఎన్టీఆర్. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. వాటివలనే ఈ యాడ్ కు చాలా కొత్త ఊపు వచ్చేసింది. అంటే ఇటువంటి గెటప్ గతంలో బృందావనం సినిమా కోసం వేశాడు కాని.. అప్పుడు కృష్ణుడుగా చెప్పారు.. ఇప్పుడు మాత్రం కూల్ రాజా అంటున్నారు. అది కథ.
ఇక సినిమాల విషయానికి వస్తే.. జై లవ కుశ చిత్రానికి బ్రేక్ ఇచ్చి బాహుబలి2ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. మే 6 నుంచి జై లవ కుశ కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
