చరణ్, సుకుమార్ సినిమా.. కన్ ఫార్మ్ అవ్వలేదట!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ రేపట్నుంచి (ఏప్రిల్ 1) ఆరంభంకానుంది. ఈ సినిమాకి లొకేషన్స్ ఫైనలైజ్ అవ్వకపొవడంతో షూటింగ్ ఆరంభమవ్వడానికి లేట్ అయ్యింది. ఫైనల్ గా పాపికొండలు, పోలవరం సమీపంలోని పూడిపల్లి గ్రామంలో షూటింగ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఆ పక్కనే ఉన్న మరో పల్లెటూరు కూడా షూటింగ్ కి బాగుంటుందట. అందుకే 40రోజుల పాటు ఆ పల్లెటూరుల్లోనే ఉండి షూటింగ్ చేయడానికి ప్లాన్ చేసారు సుకుమార్. ఇదిలా ఉంటే...

ఈ సినిమాకి 'రేపల్లె' టైటిల్ ఫిక్స్ అయిపోయిందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ వార్తల్లో నిజంలేదట. ఈ యూనిట్ కి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ''ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ అవ్వలేదు. ఇంకా టైటిల్ కోసం చర్చలు జరుగుతున్నాయి'' అని చెప్పారు. దీన్నిబట్టి ఈ సినిమాకి ఇంకా టైటిల్ కన్ ఫార్మ్ అవ్వలేదని ఫిక్స్ అయిపోవచ్చు. సమంత హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

కామెంట్‌లు