ఆకాశం నుంచి కురిస్తే వాన కురవాలి లేదంటే వడగళ్ల వాన కురవాలి. అంతగా లేదంటే ఈమధ్య చేపల వాన కూడా కురుస్తోందనుకోండి అది వేరే విషయం.దీనికి సైంటిఫిక్ రీజన్ తో సహా సైంటిస్ట్ లు చెప్పేశారు కాబట్టి ఆ ఆన్సర్ తో మనం కూల్ అయిపోయాం.మరి ఆకాశం నుంచి మందు కురిస్తే దానికి ఏమంటాం.యస్ మనం చెపుకునేది అక్షరాల గగన తలం నుంచి మందు ప్రియులకోసం వరుణుడు మందును వదలడం గురించి .
బెర్లిన్ లో మందు వర్షంగా కురిసింది.దీంతో అక్కడివారు మరీ ముఖ్యంగా టూరిస్ట్ లు మందు వానలో చిందేశారు.ఐతే ఇదంతా నిజంగా వరుణ దేవుడు మందుబాబులను కరుణించిన దృశ్యం అయితే కాదు. మెక్సికోలో పర్యాటకులను ఆకర్షించేందుకు లాపీజ్ అనే సంస్థ టకీలా (నీలం అగేవ్ మొక్కలతో చేసే ఒక రకమైన మద్యం) మేఘాన్ని క్రియేట్ చేసింది.
లియో బోర్నెట్ అనుబంధ సంస్థ లాపీజ్ ‘అల్ట్రాసోనిక్ హ్యుమిడీఫైర్స్’ ఉపయోగించి టకీలాను ఒక రకమైన ప్రకంపనల ద్వారా మేఘంగా మార్చివేసింది. ఈ మేఘం నుంచే బందుబాబులకు కావల్సిన టకీలా చినుకులుగా కురుస్తుంది. దీన్ని అక్కడికొచ్చిన టూరిస్టులు డైరెక్ట్ గా తమ గ్లాసుల్లోకి పట్టుకుని తాగుతారు.
జర్మనీ రాజధాని బెర్లిన్‌లో టకీలా మేఘాన్ని మెక్సికో టూరిజం డిపార్ట్ మెంట్ ప్రదర్శించింది. ఐతే ఇలాంటి మేఘాలతో ఎందో మధ్యం వేస్ట్ అవుతుందని పలువురు అభిప్రాయ పడ్డారు.టకీలా లవర్స్ మాత్రం వర్షంలా పడే టకీలాను తెగ లైక్ చేస్తున్నారని టూరిజం శాఖ చెబుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి