హైద్రాబాద్ అమీ చిందులకు రెడీనా

amy-jackson-ipl



మన దేశంలో ఏటేటా జరిగే అతి పెద్ద క్రీడా సంబరం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవం హైద్రాబాద్ లో జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు అదిరిపోయే రేంజ్ లో జరగనుండగా.. ప్రతీ ఏడు మాదిరిగానే ఈ సారి కూడా బాలీవుడ్ సెలబ్రిటీ డ్యాన్స్ తో ఈ సారి వేడుకలకు అదిరిపోయే ఆరంభం ఇవ్వనున్నారు.

గతేడాది బాలీవుడ్ కత్తి కత్రినా కైఫ్ తో చిందులు వేయించిన ఐపీఎల్ నిర్వాహకులు ఈసారి హైద్రాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఉత్సవానికి లండన్ బ్యూటీ అమీ జాక్సన్ ను ఆహ్వానించారు. ఇక్కడ పలు బాలీవుడ్ సాంగ్స్ తోపాటు ఐపీఎల్ థీమ్ సాంగ్ కు అదిరిపోయే డ్యాన్సులు చేయనుంది అమీ. 'అమీ జాక్సన్ ఈసారి వేడుకల్లో స్పెషల్ గా పెర్ఫామ్ చేయనుండగా.. పలువురు లోకల్ బ్యూటీస్ కూడా కనిపించనున్నారు' అంటూ ఉప్పల్ క్రికెట్ స్టేడియం వర్గాలు ధృవీకరించాయి.

ఐపీఎల్ లేటెస్ట్ సీజన్ ప్రారంభోత్సవంలో పెర్ఫామ్ చేయడం.. తనకు దక్కిన అరుదైన అవకాశం అంటోంది అమీ జాక్సన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రజినీకాంత్ మూవీ.. రోబో సీక్వెల్ 2.0 చిత్రంలో నటిస్తున్న అమీ.. ఎవడు చిత్రంలో మెగాపవర్ స్టార్ తో జోడీ కట్టి.. టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైపోయింది.