ఆ హీరోయిన్ ని కూడా పడుకోమన్నారట

parvathi-malayalam-heroine

ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు నిర్భయంగా సినిమా ఇండస్ట్రీలోని చీకటి కోణం గురించి మీడియాకు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో మళయాళ హీరోయిన్ పార్వతి కూడా చేరారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నిజమే. అది బాగా విస్తరించింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మళయాళ పరిశ్రమకి చెందిన ఓ దర్శకుడు.. ఓ హీరో పడుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చారు. అయితే, తాను అందుకు ఒప్పుకోలేదుని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
2006 లో మళయాలంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పార్వతీ మీనన్. మళయాలంతో పాటు తమిళ చిత్రాల్లో నటించింది. మళయాలంలో వచ్చిన “బెంగుళూరు డేస్” సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఇండస్ట్రీలోని చీకటి కోణంపై పార్వతీ మీనన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. యంగ్, సీనియర్ హీరోయిన్స్ సైతం కాస్టింగ్ కౌచ్ కి గురవుతున్నారన్న విషయం స్పష్టమైంది. అయితే, ఇండస్ట్రీలోని చీకటి కోణం గురించి మాట్లాడుతున్న హీరోయిన్స్.. పడుకోమని పిలిచిన దర్శక-నిర్మాతలు, హీరోల పేర్లు మాత్రం బయటపెట్టడం లేదు.