ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిపోయిన రోజా.. ఇప్పుడు పొలిటీషియన్ అయిపోయారు. రాజకీయ నాయకురాలిగా వేదికలపై స్పీచ్ లు దంచేస్తూ.. జబర్దస్త్ లాంటి కార్యక్రమంలో పాల్గొనడంపై విమర్శలు వస్తున్నా.. వాటిని ఖాతరు చేయకుండా కెరీర్ కంటిన్యూ చేస్తున్న ఆమె.. రీసెంట్ గా ఉగాది స్పెషల్ గా ఓ ఛానల్ ప్రసారమైన కార్యక్రమంలో డ్యాన్స్ లో కూడా అలరించడం విశేషం.
చాలా రోజులుగా తన నవ్వులతోనే కార్యక్రమాలను నడిపిస్తున్న రోజా.. కొంతకాలం క్రితం రచ్చబండ అంటూ కుటుంబ సమస్యల ఇతివృత్తాన్ని కూడా డీల్ చేస్తున్నారు. కానీ ఈ ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో మాత్రం.. చాలా ఏళ్ల తర్వాత రోజా డ్యాన్స్ చూసే అవకాశం అభిమానులకు చిక్కింది. అది కూడా మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ నంబర్ 150లోని అమ్మడు డ్యాన్స్ కుమ్ముడు సాంగ్ కు డ్యాన్స్ చేశారు రోజా. అది కూడా శేఖర్ మాస్టర్ మాస్టర్ తో కలిసి డ్యాన్స్ చేసేశారు రోజా.
దేవిశ్రీ ప్రసాద్ అందించిన అమ్మడు కుమ్ముడు పాటుకు రోజా చేసిన డ్యాన్స్.. పర్ఫెక్ట్ గా ఒరిజినల్ కు ఇమిటేషన్ అయినా.. రోజా స్టైల్ స్పెషల్ టచ్ లు.. ఫీలింగ్స్ కారణంగా మరింత అందం వచ్చేసింది. 44 సంవత్సరాల వయసులో రోజా ఇంత ఈజ్ తో డ్యాన్స్ చేయగలగడం చూస్తే.. ఆమెలో ట్యాలెంట్ ఇప్పటికీ ఏ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదని అనిపించడం ఖాయం.
