ఎన్టీఆర్ సింహాద్రి స్టామినా అది...స్టార్ హీరోల౦దరికీ వణుకు పుట్టించాడు



యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ ని ఓ రేంజ్ లో నిలిపిన సినిమా సింహాద్రి. 20 ఏళ్ల వయసులోనే తన ఏజ్ కి మించిన రోల్ లో అద్బుతనటనను కనబరిచిన ఎన్టీఆర్ అప్పటి స్టార్ హీరోల౦దరికీ వణుకు పుట్టించాడు, కానీ తరువాత ఆ రేంజ్ హిట్ కోసం చాలాకాలమే ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ ఎన్టీఆర్ కెరీర్ ని టోటల్ గా మార్చేసి తన ఫాలోయింగ్ ను 100 రెట్లు పెంచిన సినిమాగా సింహాద్రి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది.

కాగా ఈ సినిమా తెలుగులో సాధించిన ఆల్ టైం రికార్డు స్థాయి విజయాన్ని చూసి ఇతర ఇండస్ట్రీల వారు తమ భాషల్లో రీమేక్ చేయాలని పోటిపడ్డారు. తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి స్పెషల్ షో వేసి చూపించగా ఎన్టీఆర్ కెరీర్ గురించి ఆయన అప్పట్లోనే తెగ భాదపడ్డారు. ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తరువాత ఆ స్థాయి హిట్ కొట్టడం చాలా కష్టం అన్నారు, ఆయన అన్నట్లుగానే జరిగింది.


ఎన్ని చెప్పిన రజినీకాంత్ ఈ రీమేక్ చేయడానికి జంకడంతో మరో సూపర్ స్టార్ విజయ్ కాంత్ ఆ సినిమాను “గజేంద్ర” పేరుతో రీమేక్ చేశాడు, తరువాత కన్నడలో దునియా విజయ్ “కాంతీరవ్వ” పేరుతో రీమేక్ చేశాడు. కానీ ఈ రెండు భాషల్లో కూడా సింహాద్రి రీమేక్ ఆల్ టైం డిసాస్టర్ గా మిగిలింది.

రెండు భాషల్లో నటించిన హీరోలు ఎన్టీఆర్ నటనలో 10% కూడా నటించలేదు అని విమర్శకులు రెచ్చిపోయారు. దాంతో తెలుగులో ఓ కుర్ర హీరో ఎలాంటి అంచనాలు లేకుండా సాధించిన విజయాన్ని ఈ ఇద్దరు సీనియర్ హీరోలు మాత్రం అందుకోలేకపోయినట్లై౦ది. అదే సమయం లో ఇది ఎన్టీఆర్ ఒక్కడే చేయగలిగిన పాత్ర అని మెచ్చుకున్నారట.

Tags: NTR, Simhadri movie, Tollywood thalaiva

కామెంట్‌లు