యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం బాబి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 'జై లవకుశ' టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. రాశిఖన్నా, నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో హంసా నందిని ఓ స్పెషల్ రోల్ చేస్తోంది. తాజా వార్తల ప్రకారం సమంతను లీడ్ రోల్ కోసం తీసుకున్నారని సమాచారమ్. ఇదిలా ఉంటే...
ఈ సినిమాకి సంబంధించిన లోగో ని ఏప్రిల్ 5న ఉదయం 09.30 కి శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ విషయం బయటికి పొక్కగానే ఎన్టీఆర్ అభిమానులు తెగ హడావిడి చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. తండ్రి, ట్విన్ బ్రదర్స్ గా అలరించనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలోని నెగటివ్ షేడ్ క్యారెక్టర్ కోసం సిలికాన్ మాస్క్ వాడబోతున్నాడు. గవర్నమెంట్ ఆఫీసర్ లవకుమార్ గా మరో పాత్రలో అలరించబోతున్నాడు. తండ్రి పాత్ర చేయబోతున్నాడు కాబట్టి, ఆ గెటప్ ఎలా ఉంటుందో తెలియల్సి ఉంది. 'జై లవకుశ' చిత్రం స్టోరీ చాలా పవర్ ఫుల్ గా, డిఫరెంట్ గా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో... ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాతో సంచలనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.
