విన్నర్ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది అనసూయ. అంతకుముందు ఎందరో టాప్ రేంజ్ హీరోయిన్స్ కూడా ఐటెం గర్ల్ ముద్రకు పెద్దగా ఫీలవ్వలేదు కానీ అనసూయ మాత్రం గింజుకుని అల్లాడిపోయింది. ఐటెం అంటే ఏదో పెద్ద బూతు అన్నట్టుగా…ఐటెం గర్ల్ అని పిలవొద్దని తనకు తోచిన నీతులు చెప్పేసింది. జబర్ధస్త్‌తో బుల్లితెరపై కూడా సిల్క్ స్మిత రేంజ్‌లో రెచ్చిపోవచ్చని నిరూపించిన అనసూయ ఐటెం గర్ల్ అంటేనే హర్టయ్యేంత సున్నితంగా మారిపోయిందా అని చాలా మంది భావించారు. కానీ ఆ ఐటెంని కూడా పబ్లిసిటీ కోసం వాడేసుకోవాలనుకుంది అనసూయ. అందుకే తనకు తోచిన మాటలను నీతులుగా చెప్పేసింది. బూతుల మార్గం మాత్రం వదలనని తాజాగా వచ్చిన జెమినీ టీవీ వారి ప్రోగ్రాం ప్రోమో నిరూపించింది.
జెమినీ టీవీ వారి కోసం జాక్ పాట్ అన్న ఓ ప్రోగ్రాం చేస్తోంది అనసూయ. తనను దక్కించుకోవడమే చాలా పెద్ద జాక్ పాట్ అనే రేంజ్‌లో అనసూయ వయ్యారాలు ఉంటాయనుకోండి. ఇప్పుడు తాజా ఎపిసోడ్‌లో అంతకుమంచి అనే రేంజ్‌లో రెచ్చిపోయింది అనసూయ. పేకాట, మందు కాదు….తనను చూస్తే చాలు కిక్ ఎక్కేస్తుంది అని నడుముని ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజ్ చేసింది. ఆ సీన్ చూస్తే రాఘవేంద్రరావు కూడా టెంప్ట్ అయ్యేలానే ఉంది. ఇక ‘నాది పడుకుంటుంది………నీది లేస్తుంది………’ అంటూ ఓ మేల్ ఆర్టిస్ట్ కొట్టిన డైలాగ్‌కి అనసూయ ఎక్స్‌పెషన్స్…డైలాగ్స్…అబ్బో అధరహో. ఈ దెబ్బతో టీవీ ప్రోగ్రాములను కూడా రికార్డింగ్ డ్యాన్సులు, బూతు పంచాంగాల స్థాయికి దిగజార్చే ప్రయత్నంలో మాత్రం అనసూయ అండ్ కో ఫుల్ బిజీగా ఉన్నారని మాత్రం చెప్పొచ్చు. ఇక ఈ దరిద్రాలను చూసి తరించాలో…తన్ని తరిమేయాలా అన్నది మాత్రం ప్రేక్షకుల ఇష్టం.