రాంచరణ్ తాజా చిత్రం ‘ధృవ’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇప్పుడీ చిత్ర విషయంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ధృవ విషయంలో చరణ్, అరవింద్ మధ్య గ్యాప్ పెరిగిందన్న గాసిప్ సారాంశం.
ఇప్పటికే ‘ధృవ’ షూటింగ్ పూర్తయ్యింది. ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ లతో సినిమాపై అంచనాలు పీక్స్ చేరిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా రిలీజ్ చేసి.. అంచనాలు ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తపడాలని చరణ్ ఆశపడుతున్నాడు. మరోవైపు, అరవింద్ వర్షన్ మరోలా ఉంది. సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించకుండా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఎలా నిర్వహిస్తాం అంటున్నారట.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులో డిసెంబర్ ధృవని తీసుకురావడం ఫలితం ఉండని కూడా అరవింద్ వాధిస్తున్నాడట. ఈ క్రమంలోని ధృవ రిలీజ్ జనవరికి వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే, ప్రీ-రిలీజ్, రిలీజ్ డేట్ ఫిక్స్ విషయంలో చరణ్, అరవింద్ మధ్య గాప్ పెరిగిందని చెప్పుకొంటున్నారు. ఈ గ్యాప్ మరింతగా పెరిగితే.. ఈ మామ-అల్లుళ్ల మధ్య రిలేషన్ షిప్ దెబ్బతినే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరీ..ఏం జరుగుతుందో చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి