అనుమానాస్పద స్థితిలో మలయాళ నటి మృతి…


మలయాళ సినీ, టీవీ నటి రేఖా మోహన్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. కేరళలోని త్రిసూర్‌లో రేఖ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహాన్ని శనివారం గుర్తించారు. పలు మళయాళ మూవీలు, టీవీ సీరియల్స్‌లో రేఖా మోహన్ నటించింది. కాగా.. ఆమె ఇంటికి దూరంగా మరోచోట ఉన్న రేఖ భర్త రెండు రోజులుగా ఆమెను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. అనుమానం వచ్చిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఆమె ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లి.. తలుపులు పగులగొట్టి చూడగా లోపల రేఖ డెడ్ బాడీ కనిపించింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త్రిసూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవలే తమిళ నటి సబర్ణ చెన్నైలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.


కామెంట్‌లు