గోవా పార్టీ లో సమంత


నాగచైతన్య- సమంతల రిలేషన్ గురించి ఇప్పటికే అంతా ఓపెన్ అయిపోయింది. రీసెంట్ గా చైతు ఇంట్లోకి శామ్ మకాం మార్చేసిందనే టాక్ కూడా వచ్చేసింది. పెళ్లి వచ్చే ఏడాది అయినా.. బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ టైపులో వీరిద్దరూ ఇప్పటికే కలిసిపోయారు. ఇక దాచడానికి ఏమీ లేకపోవడంతో.. సమంత సైడ్ నుంచి ఓపెన్ స్టేట్మెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి.

నవంబర్ 23న అక్కినేని నాగచైతన్య హ్యాపీ బర్త్ డే చేసుకున్నాడు. ఆ రోజున సమంత-చైతులు సూపర్బ్ గా ఎంజాయ్ చేసేశారు. సాయంత్రం పార్టీ చేసుకున్న ఈ జంట.. ఫుల్లుగా డ్యాన్సులతో కుమ్మేశారు. ఇలా వాళ్లిద్దరూ డ్యాన్సులు చేస్తున్నప్పటి ఒక ఫోటోను.. సమంత స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసిందంటే.. శామ్ ఎంతగా ఓపెన్ అయిపోయిందో అర్ధమవుతుంది. 

ఎప్పటికీ ఇదే బెస్ట్ వీక్.. కలలో గడిపినట్లుగా ఉంది.. ఫ్యామిలీ.. ఫ్రెండ్స్.. లవ్.. అంటూ శామ్ పెట్టిన హ్యాష్ ట్యాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మొత్తానికి సమంత పోస్ట్ చేసిన ఫోటోలో క్లారిటీ లేదు కానీ.. ఆ ఫోటోతో అమ్మడు ఇచ్చిన స్టేట్మెంట్లో బోలెడంత క్లారిటీ కనిపిస్తోంది.


కామెంట్‌లు