కరీనా ప్రెగ్నెంట్ పిక్


స్టార్ హీరోయిన్లకు పెళ్లి అవుతుంది అన్నా...లేదా వారు గర్భవతి అయ్యారని తెలిసినా....వారి అభిమానులు ఎంతగా ఆనందిస్తారో...అంతకంటే ఎక్కువగా మీడియా దానిపై ఫోకస్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. తెలుగు, హిని అనే సంబంధం లేకుండా సినిమాకి సంబందించిన ఏ సెలబ్రిటీ విషయంలో అయినా ఇది సర్వసాదారణం.

ఆమధ్య ఐశ్వర్యరాయ్ విషయంలో అభిమానుల నుంచి మీడియా వరకు ఎంత హడావుడి జరిగిందో అందరికి తెలిసిందే. బాలీవుడ్లోని ఓ చానళ ఐశ్వర్యారాయ్ కూతురుని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కోసం ఏకంగా 50 లక్షలు ఖర్చు చేయడానికి సైతం వెనుకాడలేదు. అలా ఉంటుంది సెలబ్రిటీల పై అభిమానం. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చలామణి అవుతున్న కరీనాకపూర్, ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసినప్పటి నుంచి మీడియా ఆమెపై ప్రత్యేక ఫోకస్ పెడుతూనే ఉంది.

ఆమె ఏదైనా ఈవెంట్ కి వస్తే ప్రత్యేకంగా ఆమెని టార్గెట్ చేస్తుంది. తాజాగా ఓ యాడ్ నిమిత్తం ఇలా బయటకు వచ్చిన కరీనాని కెమెరాలు ఇలా క్లిక్ చేశాయి. త్వరలో కరీనా ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో బాలీవుడ్ మీడియా ఆమెపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బేబీ ప్రొడక్ట్స్ అమ్ముకునే పలు కంపెనీలకు కరీనా బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకొని తమ కంపెనీలను ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్నాయి.


కామెంట్‌లు