ఆందోళనలో సిని పెద్దలు


ప్రదాని మోడీ ఇచ్చిన షాక్‌కి సినీరంగానికి చెందినా కొదరికి దిమ్మ తిరగడం ఖాయమట.వారు ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారని సమాచారం.రాజకీయ నాయలకులైతే ఏదో విధంగా తమ ఆవేదనని పబ్లిక్‌లో చెప్పుకుంటున్నారు కానీ సడన్‌గా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎన్నో కోట్ల రూపాయల నల్ల ధనం ఏమి చేసుకోవాలో తెలియని సెలబ్రిటీలు కక్కలేక, మింగలేక అవస్థలు పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా మంది సినిమా వాళ్ల దగ్గర నల్ల డబ్బు కోట్లలోనే వుందట.

ఎంతగా వేరే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినప్పటికీ క్యాష్‌ రూపంలో డబ్బు వుండడం అనేది కామనే కాబట్టి ఇప్పుడు ఆ డబ్బు అంతా వృధా పోయినందుకు దిగులు పడుతున్నారట. అయితే లోపల ఎంత బాధ వున్నా మోడీని పొగుడుతూ మాట్లాడకపోతే తమని అవినీతిపరులు అనేస్తారనే భయంతో ఎవరికి వారే ఇష్టమున్నా, లేకపోయినా ప్రధాని నిర్ణయాన్ని హర్షిస్తూ మాట్లాడుతున్నారు.అయితే ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోయి పెంచేసిన తెలుగు సినిమా మార్కెట్‌ సగానికి పడిపోతుందని ట్రేడ్‌ వాళ్లు భయపెడుతున్నారు. ఎలా చూసినా ఇకపై సినిమా వాళ్లకీ, సినిమాకీ గడ్డు కాలమే అంటున్నారు.


కామెంట్‌లు