టాలీవుడ్ ఖాళీ...!


500, 1000 రూపాయల రద్దు ఎఫెక్ట్ టాలీవుడ్ ను బలంగా తాకింది. ఫైనాన్స్ వ్యాపారం అండతో రూపుదిద్దుకునే సినీ పరిశ్రమ రొక్కం దొరక్క తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ప్రతి రోజూ 20 సినిమాల షూటింగ్ జరగాల్సి ఉండగా, ప్రస్తుతం పది సినిమాల షూటింగ్ లు మాత్రమే జరుగుతున్నాయని తెలుస్తోంది. జూనియర్ ఆర్టిస్టులు, ఇతర కార్మికులకు రోజువారీ వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని, అయితే వారికి చెల్లించేందుకు సరిపడా నగదు లేక, షూటింగ్ లు వాయిదా వేసుకున్నట్టు సమాచారం.

అలాగే “బాహుబలి” నిర్మాతల ఇల్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరగడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ప్రయత్నించే ఆలోచనను కూడా సినీ పరిశ్రమ చేయడం లేదు. అదే సమయంలో విడుదలైన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు కూడా ముందుకు రావడం లేదని, దీంతో ధియేటర్లు వెలవెలబోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా కలెక్షన్లపై పెద్ద కరెన్సీ రద్దు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిందని సినీ పరిశ్రమ చెబుతోంది.


కామెంట్‌లు