గత రెండు రోజులుగా ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకేక్కబోతుంది అని పరిశ్రమలో ప్రచారం జరుగుతుంది. రాజమౌళి బాహుబలి2 తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలనీ అనుకున్తున్నాడని, ఆ సినిమాకోసం ఎన్టీఆర్ ని మూడేళ్ళ డేట్స్ అడిగాడని, దాని ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడని టాక్ వచ్చింది.
అది జస్ట్ స్పెక్యూలేషనా కాదా అనే విషయం పక్కకుపెడితే ఈ రోజు అందుకు సంబందించిన మరో వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే...ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ రాజమౌళి గరుడ అని, అందుకే మూడేళ్ళు పడుతుందని అంటున్నారు. రెండు మూడు నెలల క్రితం జక్కన్న గరుడ అనే ప్రాజెక్ట్ కి ప్లాన్ చేస్తున్నాడు అని, ఈ సినిమాని వెయ్యికోట్ల బడ్జెట్ అవుతుందని వార్తలు వచ్చాయి.
ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు ఆల్రెడీ జరుగుతున్నాయని, కానీ ఈ విషయం బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు ఈ సినిమా లో ఎన్టీఆర్ హీరో అని తేలడంతో ఈ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే బాలీవుడ్.. టాలీవుడ్ అనే తేడాలేకుండా రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటున్నారు సినీ జనాలు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి